పత్తి చేనులో పని చేస్తుండగా పాము కాటు

BHNG: రాజపేట మండలం బేగంపేటలో విషాదం చోటు చేసుకుంది. పత్తి చేనులో పని చేస్తున్న ఓ రైతు పాము కాటుతో మరణించాడు. గ్రామానికి చెందిన జామ చెట్టు భాస్కర్ గౌడ్ శుక్రవారం తన పత్తి చేనులో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.