మండల రైతులకు శుభవార్త

PLD: కారంపూడి మండలంలోని 6,465 మంది రైతులకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద రూ. 4.53 కోట్లు విడుదలైనట్లు వ్యవసాయ అధికారి పోట్ల నరసింహారావు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7,000 చొప్పున నేరుగా జమ కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులను పంటల సాగు కోసం సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.