ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ పట్టణం నుంచి ఆర్టీసీ బస్సులో బోరంచ వరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆదివారం ప్రయాణించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణ ఖేడ్ డిపోకు 18 కొత్తగా ఆర్టీసీ బస్సులు వచ్చినట్టు చెప్పారు. జూన్‌లో మరో కొత్త బస్సులు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని తెలిపారు.