వరదలో కొట్టుకుపోయిన యువకుడు
KNR: గన్నేరువరం మండల కేంద్రంలోని ఊర చెరువు మత్తడి వరదలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీహార్‌కు చెందిన రజీప్ వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. నీటిలో మునిగిపోయిన దుర్గామాత విగ్రహం స్టాండ్‌ను పట్టుకుని అతను ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక జాలర్లు అతడిని తాడు సహాయంతో బయటకు తీశారు.