అడుగడుగున స్వాగతిస్తున్నా.. గుంతలు
SKLM: పాతపట్నం నియోజకవర్గం నుంచి టెక్కలి వెళ్లే తెంబూరు రోడ్డుపై చెరువులను తలపించేలా గోతులు దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా స్వాగతిస్తున్నా గుంతల దారిలో ప్రయాణం చాలా కష్టంగా ఉందన్నారు. ఈ కొలనుల మార్గంలో అష్ట కష్టాలు పడి చోదకులు గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి భారీ గోతులను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.