డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి నిశ్చితార్థం

డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి నిశ్చితార్థం

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి నిశ్చితార్థ వేడుక ప్రజాభవన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు వేడుకకు హాజరయ్యారు.