సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి మహా యజ్ఞం చేపట్టామని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. గురువారం రాజేశ్వరరావు నగర్ , బసవ తారక రామ్ నగర్, మల్లికార్జున పేట ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.