వాహన మిత్ర పథకంపై అవగాహన కల్పించాలి: జేసీ

ATP: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో దసరా సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు రేడియం జాకెట్లు, హెల్మెట్లు, కటింగ్ మిషన్లను మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహన మిత్ర పథకంపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.