ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమం
CTR: గ్రామాల్లో ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించాటానికే రచ్చబండ కార్యక్రమం చేపట్టినట్లు వైసీపీ మండల అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆదివారం పుంగనూరు మండలం ఈడిగపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.