సింగరాయకొండలో రేపు సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం

ప్రకాశం: ఈ నెల 4వ తేదీన సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం కానుంది. కోర్టు ఏర్పటుతో సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు, కొండపి, పొన్నలూరు మండలాలకు ప్రయోజనం చేకూరే అవకాశముందని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. దీంతో కేసులు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశముందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.