పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కాకినాడ: తుని మండలంలో పోలవరం ప్రాజెక్టు పనులను పోలవరం అడ్మినిస్ట్రేటర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గురువారం పరిశీలించారు. చేపూరులో ముంపు బాధితులకు నిర్మిస్తున్న R&R కాలనీ పనులను ఆయన తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం కాలువ పనులను పర్యవేక్షించారు.