టెన్త్ విద్యార్థులకు డీఈవో ముఖ్య సూచన

టెన్త్ విద్యార్థులకు డీఈవో ముఖ్య సూచన

NDL: టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఇవాళ్టితో ముగుస్తుందని డీఈవో జనార్దన్ రెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం అక్టోబర్ 28వ తేదీ ఆఖరు కాగా, ఆ గడువును ఇవాళ్టి వరకు పొడిగించారు. ఈ రోజు చెల్లించని వారు రూ. 50 అపరాధ రుసుముతో ఈ నెల 12వ తేదీ వరకు, రూ. 200 అపరాధ రుసుముతో 15 వరకు, రూ. 500తో 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు.