VIDEO: అకాల వర్షం.. జొన్నపంట నేల మట్టం

VIDEO: అకాల వర్షం.. జొన్నపంట నేల మట్టం

ASF: ఆసిఫాబాద్ మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షం జొన్న రైతులను నిలువునా ముంచింది. కోత దశకు వచ్చిన పంట ఒక్కసారిగా నేలమట్టం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పొలాల్లో నీరు నిలిచి, మొక్కలు కుప్పకూలాయి. పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, తమను ఆదుకోవాలని కోరుతున్నారు.