అమ్మవారి హుండీ లెక్కింపు

SKLM: పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం హుండీ లెక్కింపు చేపట్టారు. గత 53 రోజులకు గాను అమ్మవారికి రూ.7,31,962 ఆదాయం నగదు రూపంలో వచ్చిందని ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు. హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమంలో శ్రీకాకుళం సహాయ కమిషనర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, ఆలయ అర్చకులు అనుమంచిపల్లి శివ ప్రసాద్, సంతోష్ ఉన్నారు.