రాణి పేటలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో శుక్రవారం ‘డ్రై డే - ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ పాల్గొని, నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల ఉత్పత్తిని అరికట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజేశ్వరి, రాధిక తదితరులు పాల్గొన్నారు.