తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
MHBD: కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామానికి చెందిన ముత్యం రమేష్(42) అనే వ్యక్తి అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. మృతుడికి పుత్ర సంతానం లేకపోవడంతో కుమార్తె స్పందన తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఇది చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.