నేడు అనంతపురం పర్యటనలో హోం మినిష్టర్ అనిత

ATP: రాష్ట్ర హోం మంత్రి అనిత శుక్రవారం రాత్రి అనంతపురం విచ్చేశారు. పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 2024 బ్యాచ్ ఎస్వలకు సంబంధించి శనివారం నిర్వహించే పాసింగ్ అవుట్ పరేడ్‌లో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.