15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం
కృష్ణా: 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. శుక్రవారం చల్లపల్లి అశోక్ నగరులో గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. సర్పంచ్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, వార్డ్ సభ్యులు మీర్ రిజ్వాన్ పాల్గొన్నారు.