అనపర్తి క్రికెట్ లీగ్ ప్రారంభించిన టీడీపీ నేత

అనపర్తి క్రికెట్ లీగ్ ప్రారంభించిన టీడీపీ నేత

తూ.గో: సంక్రాంతి పండగ పురస్కరించుకుని అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న అనపర్తి క్రికెట్ లీగ్ (ACL) క్రికెట్ టోర్నమెంట్‌ను టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కరాచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.