ప్రజా పాలనను నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా పాలనను నిర్వహించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రజాపాలన నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల గ్రామ ప్రజలు హాజరయ్యి పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.