నేడు మంత్రి పర్యటన వివరాలు
NDL: బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం 10:30 గంటలకు'దివ్యాంగ శక్తి'పథకాన్ని ప్రారంభిస్తారని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దీని ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి కార్యాలయ సిబ్బంది కోరారు.