బాపట్లలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం

బాపట్లలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం

బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జే. వెంకట మురళి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మురళి పలు కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమాచారం పొందారు. అధికారులతో కలిసి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు.