ప్రొద్దుటూరు కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే

KDP : ప్రొద్దుటూరు పరిధిలోని కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కామనూరులోని శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఆలయం, గోశాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు ఆహారాన్ని తినిపించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.