ప్రభుత్వ పాఠశాలలో వైద్య శిబిరం

ప్రభుత్వ పాఠశాలలో వైద్య శిబిరం

WGL: వరంగల్ నగరం కరీమాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం హెల్త్ క్యాంపును నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కార్పొరేటర్ మరుపల్ల రవి, వైద్యురాలు డాక్టర్ అనిత సూచించారు. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.