నామినేషన్ సెంటర్ వద్ద పోలీసుల బందోబస్త్
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సెంటర్ వద్ద ఆదివారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ సిబ్బందితో కలసి SI తనిఖీ చేశారు. ఎన్నికల అధికారుల నియమావళి ప్రకారం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.