అయ్యప్ప దర్శనం.. తండ్రి కొడుకులు మృతి
TPT: శబరిమలై యాత్రను ముగించుకుని తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. వరదయ్యపాలెం మండలం ఇందిరానగర్ పంచాయతీ నివాసంలో ఉంటున్న నరేష్(28), తన తండ్రి వేణు(58), తిరుగు ప్రయాణంలో దిండికల్ బైపాస్ రోడ్డు పెరియాకులం గ్రామం వద్ద గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.