VIDEO: శంషాబాద్‌లో మొసలి సంచారం
RR: శంషాబాద్ మున్సిపాలిటీలోని సిద్దేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న వాగులో మొసలి సంచారం స్థానికులను, భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. కార్తీక మాసం కావడంతో దీపాలు వెలిగించడానికి, పూజల కోసం వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మొసలిని తక్షణమే పట్టుకుని జూపార్కుకు తరలించాలని భక్తులు అటవీ అధికారులను కోరుతున్నారు.