వినాయకుడి సేవలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

వినాయకుడి సేవలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధ దసభుజ మహా వినాయకుడిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పదవి వచ్చిన అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పురోహితులు ఆయనకు స్వాగతం పలికారు. పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.