నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్: సూర్యనారాయణ రెడ్డి
E.G: సీఎం జగన్ రాజకీయాల్లో నిజాయితీకి, నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి మండలం కొప్పవరంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసీపీ అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.