వికలాంగుడికి అండగా జనసేన నాయకులు
NDL: మహానంది మండలం గాజులపల్లెలోని ఎస్సీ కాలనీకి చెందిన పి.బాల నరసింహుడు 2 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయాడు. జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం మహానంది మండల జనసేన నాయకులు రూ.10 వేల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వికలాంగుల దినోత్సవం రోజు ట్రై సైకిల్ కూడా అందిస్తామన్నారు. జనసేన పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.