స్వతంత్ర పోరాటంలో తెల్లదొరలకు సింహస్వప్నంగా మారిన అల్లూరి

VZM: స్వతంత్య్ర పోరాటంలో తెల్లదొరలకు అల్లూరు సింహస్వప్నంగా మారారని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు అన్నారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో అల్లూరు సీతారామరాజు 128వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పాపారావు మాట్లాడుతూ.. అడవుల్లో ప్రకృతి సంపద అనుభవించే హక్కు గిరిజనులకు ఉందని అన్నారు.