'రంజాన్ మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలి'
VZM: రంజాన్ పండగను శాంతియుతంగా, మత సామరస్యంతో జరుపుకోవాలని విజయనగరం 1వ పట్టణ సీఐ ఆర్.వి.కే చౌదరి సూచించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరంలోని ముస్లిం మత పెద్దలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమాలకు ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు.