వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు మహోత్సవం

VZM: గజపతినగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారికి క్షీరాభిషేకం, పల్లకి సేవ జరిపారు. రుత్వికులచే లక్ష కుంకుమార్చన జరిపారు. కొల్లా సత్యనారాయణ, కొల్లా తౌడు కృష్ణారావు, దివంగత కొల్లా నరసింహస్వామి కుమారులు ఈ వేడుకలను నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు ప్రసాద వితరణ గావించారు.