వీధికుక్కల బెడద..ఆందోళనలో ప్రజలు

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్ కాలనీలో వీధికుక్కల బెడద ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. కన్యకా పరమేశ్వరి ఆలయం, చికెన్ సెంటర్ల వద్ద పిల్లలు, వృద్ధులు కుక్కల దాడులకు గురవుతున్నారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులు, పండుగ సమయాల్లో ఆలయానికి వచ్చే మహిళలు అసౌకర్యానికి లోనవుతున్నారు. వీధికుక్కల సమస్యకు అధికారులు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.