జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం నియోజకవర్గ పట్టణ స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం జరిగిన జాబ్ మేళాలో శాసనసభ్యులు గొండు శంకర్రావు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం యువతకు ఉపాధిని కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసు నాయుడు, పలువురు అధికారులు, యువత పాల్గొన్నారు.