నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు

నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన యువతకు రేపు ఉదయం 10 గంటలకు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్ (వైటీసీ)లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని అధికారులు కోరారు.