26న శ్రీ చక్రేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు
NZB: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో ఈ నెల 26వ తేదీన హుండీ ఆదాయం లెక్కింపు జరగనుంది. ఆలయ ఈవో రాములు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎండోమెంట్ అధికారుల సమక్షంలో జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సహకరించాలని ఆయన కోరారు.