BREAKING: కీలక ఉగ్రనేతలు హతం

ఆపరేషన్ సింధూర్‌లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. మురిడ్కేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపుదాడులు చేసింది. మరోవైపు లష్కర్-ఇ-తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్, మరో ఉగ్రనేత ముదాసిర్ కూడా మృతి చెందారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే.