ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బగ్గు అర్చన
SKLM: నరసన్నపేట మండలం డోలపేట గ్రామం శ్రీ నీలమ్మ తల్లి, అసిరి తల్లి గ్రామ దేవత ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా గ్రామస్థులు ఆహ్వానం మేరకు నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.