మంచి పోషకాహారం తీసుకోవాలి: సీడీపీవో
NLG: దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండా అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో చంద్రకళ పాల్గొని మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవలసిన పోషక విలువల గురించి వివరించారు. పరిసరాలలో దొరికే కాయగూరలు, ఆకుకూరలు సీజనల్ పండ్లు సిరి ధాన్యాలు ,చిరు ధాన్యాలు తప్పకుండా తీసుకోవాలన్నారు.