ఖమ్మం రైల్వేస్టేషన్‌లో కుక్కలు
ఖమ్మం రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద ఎక్కువైంది. ప్లాట్‌ఫారాలు, ఓవర్ బ్రిడ్జిలపై కుక్కలు సంచరిస్తుండటంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవి బెదిరి దాడులు సైతం చేస్తున్నాయి. స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్నా, కుక్కలను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.