పోలీసుల ఆధ్వర్యంలో యూనిటీ ఫర్ రన్ ర్యాలీ
AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, టౌన్ సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి యూనిటీ ఫర్ రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవంగా ర్యాలీ చేసామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.