కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
MHBD: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మానుకోట మండల పరిధిలోని పలు ధాన్యపు కొనుగోలుకేంద్రాలను మంగళవారం ఉదయం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.