VIDEO: కిరాణా షాపులో నగదు, బంగారం లూటీ

VIDEO: కిరాణా షాపులో నగదు, బంగారం లూటీ

సూర్యాపేట పట్టణంలోని చింతల చెరువు 17వ వార్డులో గల శ్రీ రామాంజనేయ కిరాణా షాపులో చోరీ జరిగింది. యజమాని రాజేష్ రాత్రి షాపు మూసి వెళ్లగా, దుండగులు తలుపు గడియా పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. కౌంటర్‌లోని రూ.50 వేల నగదు, 12 గ్రాముల బంగారం, 30 తులాల వెండి కడియాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.