'గ్యాస్ సిలిండర్ల కోసం ఎలాంటి ఆందోళన వద్దు'
కాకినాడ: జిల్లాలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని జిల్లా సరఫరా అధికారి (DSO) సత్యనారాయణ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 18,326 గృహ వినియోగ, 546 వాణిజ్య సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, బుక్ చేసిన వారం రోజుల్లో సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, జిల్లా జనాభా దృష్ట్యా ఈ నిల్వలు కేవలం కొన్ని రోజులకే సరిపోతాయన్నారు.