'దృశ్యం 3' వాయిదా.. కొత్త తేదీ ఇదే
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా చిత్రం ‘దృశ్యం 3’ విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 3న విడుదల కావాల్సి ఉండగా, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మేకర్స్ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. మోహన్ లాల్‌కు గల్ఫ్ దేశాల్లో భారీ మార్కెట్ ఉండటంతో వసూళ్లపై ప్రభావం పడకూడదని చిత్రాన్ని వాయిదా వేశారు. కాగా, ఈ సినిమాను మే 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.