ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి సమీక్ష
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న ఆర్డబ్ల్యూఎస్ పనులపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి ఎద్దులు లేకుండా చూడాలని ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరగతిన పూర్తి చేయాలని కోరారు.