ఉప్లూర్ నల్ల చెరువులో మొసలి కలకలం

ఉప్లూర్ నల్ల చెరువులో మొసలి కలకలం

NZB: కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ నల్ల చెరువులో ఆదివారం మొసలి కలకలం రేపింది. గత కొంతకాలంగా నల్ల చెరువులో మొసలి ఉందన్న వదంతులు వ్యాపించిన నేపథ్యంలో పలువురికి మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. చెరువులోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.