చేగుంట సర్పంచ్ స్థానానికి 188 నామినేషన్లు
మెదక్: జిల్లాలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలకు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. గత నెల 30 నుంచి ఈ నెల 2 వరకు ఎనిమిది మండలాల్లో అధికారులు నామినేషన్లు స్వీకరించారు. చేగుంటలో సర్పంచ్ స్థానానికి అత్యధికంగా 188 నామినేషన్లు దాఖలు కాగా, అత్యల్పంగా నార్సింగిలో 65 నామినేషన్‌లు నమోదయ్యాయి.