కాశీబుగ్గలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కాశీబుగ్గలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

SKLM: పలాస మండలం కాశీబుగ్గ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం నడుస్తూ వెళ్తున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని స్థానికులు 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్ పాపినాయుడు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.